Friday, August 1, 2008

అలవాటు

కలలు కనండి. ఆ కలల్ని సాకారం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేయండి.
యువతకు కలలు లేక కాదు. ఆ కలల్ని సానబెట్టే మనుషుల కొరత ఉంది.
EXPRESS YOURSELF = మిమ్మల్ని మీరు వ్యక్తీకరించుకోండి.

చేసే పని చిన్నదే అయినా వాటిని గొప్పగా నిర్వహించలేకపోయినా చేయడం అనేది గొప్ప విషయం.
I CAN EVERY = నేను ఏదైనా చేయగలను అనుకోవాలి.

WINGS OF FIRE : దేవుడు ప్రతి ఒక్కరికీ అద్భుత శక్తులను ధారపోస్తాడు. వాటిని రగిలించుకోవాల్సింది మనమే. ఎవరికి వారు మంటలను ఎగతోసుకోవాలి. ఆ శక్తిని రగిలించుకోవాలి. మన కింద కట్టెల్ని మనమే పెట్టుకుని రగిలించుకుని దూసుకుపోవాలి.

అలవాటు మీ జీవితాన్ని మార్చేస్తుంది!

ఆలోచనను నియంత్రించకపోతే మనసు అదుపు తప్పుతుంది.

మాటను నియంత్రించకపోతే మనవారికి మనలను దూరం చేస్తుంది.
చేతలను నియంత్రించకపోతే గౌరవం చేయిజారిపోతుంది.

కానీ...........

అలవాట్లను నియంత్రించకపోతే జీవనగమనమే మారిపోతుంది. ఎందుకంటే అలవాట్లు మన వ్యక్తిత్వానికి ప్రతీకలు. మన
జీవన గమనాన్ని నిర్దేశించే మార్గదర్శకాలు. వాటికి ఎంతో ప్రాముఖ్యం ఉంది.
మన విజయం లోనూ అపజయంలోనూ అవి పోషించే పాత్ర అతి కీలకం. వాటిని అలవర్చుకోవటం తేలికే. అదుపు చేయటమే కష్టం. అలవాట్లు మనిషి మనసును, ఆలోచనలను గుప్పెట్లో పెట్టుకుంటాయి.
మనిషి వ్యక్తిత్వం అలవాట్ల కలయిక. అవి ఎంతో ధృడంగా ఉంటాయి. అందుకే మన వ్యక్తిత్వం మనకు తెలియకుండానే అలవాట్ల రూపం లో ఎప్పుడూ బయటపడుతూనే ఉంటుంది.
మనిషి మనసు ఆశల నిలయం. దానిలో ఏదో ఒక ఆశ నిత్యం సరికొత్తగా ఊపిరి పోసుకుంటూనే ఉంటుంది. దాని గోడు వినే వరకు గోల చేస్తూనే ఉంటుంది. ఒక్క సారి ఆ ఆశను తీర్చటానికి పూనుకుంటే తరువాత అది అలవాటుగా మారుతుంది. ఆ అలవాటు మంచిది అయితే పర్వాలేదు. మరి చెడ్డదైతే ........ ఓ వ్యసనమై కూర్చుని విసిగిస్తుంది. అందుకే మొదట్లోనే దాని గొంతు నులమాలి. అధః పాతాళానికి అణచాలి. లేదంటే అది మన మనసును గుప్పెట్లో పెట్టుకుని గంతులు వేస్తుంది. మనలను లొంగదీసుకుని మనపై స్వారీ చేస్తుంది. మన విచక్షణను హరించి, ఎంతో అందంగా నిర్మించుకున్న మన జీవిత సౌధాన్ని మన చేతుల్తోనే కూలదోసేలా చేస్తుంది. మనం సరదా అనుకున్న ఓ చిన్న అలవాటే వ్యసనంగా మారి కర్కశంగా మనల్ని కబళిస్తుంది. నిండు జీవితాన్ని నిలువునా కూల్చేస్తుంది. అలవాటు మంచిది కానీ చెడు అలవాటు మహా మొండిది. అందుకే అలవాటు ఎప్పటికీ అలవాటు గానే ఉండాలి, వ్యసనం కాకూడదు.

మన విచక్షణను హరించి, మనపై మనకు నియంత్రణ లేకుండా చేసేది ఏదైనా చెడ్డ అలవాటే. పురాణాల్లో కొందరు మహరాజులు వ్యసనాల వల్ల రాజ్యాలుకోల్పోయారు. దేవదాసు తన బాధను మరచిపోవటానికి ముందుచూపు లేకుండా మందు బాటిల్ పట్టాడు. ఆ మత్తులో గతాన్ని తవ్వుకుంటూ, వర్తమానమంతా విషాదాన్ని నింపుకుని, భవిష్యత్తును బండలు చేసుకున్నాడు. మంచి అనేది మనిషిని మహోన్నతుణ్ని చేస్తే, చెడు చేతగానివాణ్ని చేస్తుంది. మన శక్తిని, యుక్తిని మన నుండి నిర్దయగా లాక్కెళ్లి పోతుంది. మన పురణాలు, పుస్తకాలు, అందులోని పాత్రలు ఆ నిజాలను మనకేనాడో స్పష్టం చేశాయి. అందుకే అలవాట్లలో సైం మంచిదే పెంపొందించుకోవాలి. కానీ చెడుని పెంచి పోషించుకోకూడదు. మనకుండే చెడు అలవాట్ల వల్ల ఇతరులకు ఎలాంటి నష్టమూ ఉండదు. అన్ని విధాలా నష్టపోయేది మనమే.

ఈ ప్రపంచంలో అతి దురదృష్టకరమైన విషయం ఏమిటంటే మనిషి మంచి అలవాట్లను విడిచి పెట్టినంత త్వరగా చెడు అలవాట్లను త్యజించలేడు.

ఏ అలవాటైనా చేసుకోవటం ఎంత సులభమో, దనిని వదిలించుకోవం అంతే కష్టం. అయితే అసాధ్యం మాత్రమ్ కాదు. కాస్త ప్రయత్నిస్తే ఫలితం దక్కక మానదు.


విజయం ఎప్పుడో ఒకసారి వచేది కాదు. అది నిరంతరం రావాలి.